రాజీ మార్గమే రాజమార్గం
ఇరుపక్షాలు గెలిచినట్టే..
లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకోవడం వల్ల ఇరుపక్షాలు గెలిచినట్లే. లోక్ అదాలత్‌లో కేసులను రాజీ చేసుకుని ప్రశాంతమైన జీవితం గడపాలి. క్షణికావేశంలో జరిగిన ఘర్షణలు కేసుల నమోదుల కారణంగా కక్షిదారులు కోర్టు చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒక మంచి ఆలోచనకు వచ్చి లోక్ అదాలత్‌ను వేదికగా చేసుకుని రాజీ కుదుర్చుకుని శాంతియుత వాతావరణంలో జీవించాలి.
– డి.రవీంద్రశర్మ,
ఇన్‌చార్జ్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి
మహబూబాబాద్ రూరల్: సత్వర న్యాయం, సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న లోక్ అదాలత్ వేదికగా కక్షిదారులు రాజీకి వచ్చి కేసులను తొలగించుకుని ప్రశాంతంగా జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోరుతుంది. కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఇన్‌చార్జ్ జిల్లా జడ్జి రవీంద్రశర్మ, కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఆధ్వర్యంలో జడ్జీలు, న్యాయవాదులు, న్యాయ సంస్థలు, ఎకై ్సజ్, సివిల్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించిన సమయంలో రాజీ పడదగిన సివిల్, మోటారువా హన ప్రమాదాలు, క్రిమినల్, వివాహ కుటుంబ కేసులు, బ్యాంకు చెక్కు బౌన్స్ కేసులు, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, విద్యుత్ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచిస్తున్నారు.
9,439 కేసుల పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 2024 సంవత్సరంలో 4 పర్యాయాలు నిర్వహించిన లోక్ అదాలత్లో 9,439 కేసులు పరిష్కారం అయ్యాయి. మార్చి 16న 3,323 కేసులు. జూన్ 8న 1,088 కేసులు, సెప్టెంబర్ 28న 1,777 కేసులు డిసెంబర్ 14న 3,251 కేసులు పరిష్కారం జరిగాయి.
నేడు జాతీయ లోక్ అదాలత్
జిల్లా కోర్టు భవనాల సముదాయ ప్రాంగణంలో నేడు (శనివారం) ఉదయం పది గంటలకు జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ఇన్‌చార్జ్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ, సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి సి.సురేష్ పేర్కొన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులో తెలియజేసి రాజీ కుదుర్చుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
రాజీ మార్గమే రాజమార్గం
Comments
Please login to add a commentAdd a comment