మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహబూబాబాద్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సీ్త్ర, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ మహిళలు విద్యా, ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాలంబన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మచారి, డీడబ్ల్యూఓ దనమ్మ, డీఎంహెచ్‌ఓ మురళీధర్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ డాక్టర్ నాగవాణి పాల్గొన్నారు.
రాయితీపై విస్తృత ప్రచారం చేయాలి
మహబూబాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఈనెల 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే ఫీజు 25 శాతం రాయితీ విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ బుద్ద ప్రకాష్ జ్యోతి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, టీపీఓ సాయిరాం, డీపీఓ హరిప్రసాద్, మానుకోట, తొర్రూర్ కమిషనర్లు నోముల రవీందర్, శాంతి కుమార్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment