హన్మకొండ: హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి మహిళలను తరలించేందుకు వరంగల్ రీజియన్‌లో 12 బస్సులు కే టాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలకు రెండేసి బస్సుల్లో మహిళలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అద్దె బస్సులను మహిళలకు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో ఎన్ని బస్సులు కేటాయిస్తారనే దానిపై స్పష్టత కరువైంది. దీనిపై ఆర్టీసీ అధికా రులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని తెలిపారు. వరంగల్ రీజియన్‌కు మహిళా సంఘాలకు 40 నుంచి 50 బ స్సులు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. మహిళా దినోత్సవం రోజున జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా 150 బస్సులు మహిళా సంఘాలకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వరంగల్ రీజియన్‌కు ఎన్ని ఇస్తారనేది నేడు(శనివారం) స్పష్టం కానుంది.
వాజ్‌పేయి జ్ఞాపకాలతో డాక్యుమెంటరీ
హన్మకొండ: మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి జీవిత చరిత్ర, ఆయనతో ప లువురు వ్యక్తులకు సన్నిహిత సంబంధాల జ్ఞాపకాలతో డాక్యుమెంటరీ రూ పొందించనున్నట్లు అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ‘అటల్ జీ యాది (స్మృతి)లో నేను’ అనే ఈ కార్యక్రమాన్ని బీజేపీ జా తీయ నాయకత్వం తీసుకుందన్నారు. వాజ్‌పేయితో సన్నిహితంగా ఉన్న వారు ఉమ్మడి వరంగల్‌లో ఎందరో ఉన్నారని, వారంత తమ వద్ద ఉన్న జ్ఞాపకాలను తన వాట్సాప్ నంబర్లు 9849235055, 9550735675కు గాని ఎఎస్‌ఆర్‌నాయక్9 ఎట్‌దీ రేట్ జీమెయిల్ డాట్ కామ్‌కు పంపాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌రావు, ధర్మారావు, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు పద్మ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment