వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ బస్టాండ్ సమీపం సెంట్రల్ కాంప్లెక్స్‌లోని శ్రీహర్ష కన్వెన్షన్‌హాల్‌లో పోటీలు జరగనున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన వారికి నగదు పురస్కారంతోపాటు ప్రశంసపత్రాలు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు నమోదు , ఇతర వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment