బాధిత మహిళలకు భరోసా ‘సఖి’ కేంద్రాలు..
మహబూబాబాద్ సఖి సెంటర్ ద్వారా ఏడాదిలో
అందించిన సేవల వివరాలు
సఖి కేంద్రంలో నమోదైన కేసుల సంఖ్య : 284
పరిష్కరించిన కేసులు : 197
పెండింగ్ కేసులు : 87
సఖి కేంద్రంలో అందించిన సేవలు :
సైకో సోషల్ కౌన్సిలింగ్ : 630
లీగల్ కౌన్సెలింగ్ : 425
డీఐఆర్ ఫైలింగ్: 11
అవగాహన కార్యక్రమాలు : 93
పాల్గొన్న సభ్యుల సంఖ్య : 19,659
181 మహిళా హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన 82 కాల్స్‌కు 25 కేసులు నమోదు చేశారు.
284 కేసుల్లో 123 మందికి (పిల్లలతో) షెల్టర్ ఇచ్చారు.
వరంగల్ సఖి సెంటర్ ద్వారా అందించిన
సేవల వివరాలు
కౌన్సెలింగ్ నిర్వహించిన కేసులు : 1292
ఫ్రీ లీగల్ ఎయిడ్/ లీగల్ కౌన్సెలింగ్ అందించిన కేసులు: 527
పోలీసు సాయం అందించిన కేసులు : 426
వైద్య సాయం అందించిన కేసులు: 566
వసతి కల్పించిన కేసులు : 402
అత్యవసర సమయాల్లో రెస్క్యూ చేసిన కేసులు : 75
సర్వైవర్ కిట్స్ ఇచ్చిన కేసులు : 60
ఇప్పటి వరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు: 856
పాల్గొన్న సభ్యులు: 51,365
సాక్షి, వరంగల్/ సాక్షి, మహబూబాబాద్ : సఖి కేంద్రాలు బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయి. వేధింపులు, గృహ హింస నుంచి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించడానికి ఈ కేంద్రాలు సాయపడుతున్నాయి. బాధిత మహిళకు తక్షణ వైద్యం, న్యాయ, ఆర్థిక సాయం అందిస్తున్నాయి. కాగా, 181 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించడం ద్వారా బాధిత మహిళలకు సాయం అందనుంది. కాగా, వరంగల్ సఖి సెంటర్ 2019 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1295 కేసులు వస్తే 945 పరిష్కరించారు. 200 కేసులు మూసివేశారు. 21కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 109 కేసులు కోర్టులో నమోదయ్యాయి. అలాగే, మహిళా హెల్ప్ లైన్ ద్వారా 725 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment