ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..
● వ్యక్తి అరెస్ట్
● వివరాలు వెల్ల డించిన ఏసీపీ దేవేందర్‌రెడ్డి
వరంగల్ క్రైం: ప్రభుత్వ ఉద్యోగాలు, నిట్ లాంటి కళాశాలలో సీ టు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ. లక్షల్లో డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు దండుకున్న వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.5.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.68 లక్షల నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఐడీఎఫ్‌సీ డెబిట్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హనుమకొండ పీఎస్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వె ల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, వీరపునాయుడిపల్లి మండలం, ఇందుకూరు కొత్తపల్లికి చెందిన కొమ్మ వివేకానంద రెడ్డి అలియాస్ కిశోర్‌రెడ్డి కొంత కాలం ప్రైవేట్ టీచర్‌గా పనిచేశాడు. ఈ సమయంలో సహ ఉద్యోగుల వద్ద అవసరానికి డ బ్బులు, బంగారం తీసుకుని ఇవ్వకుండా మోసం చేశాడు. ఈ ఘటనలో రెండు నెలలు జైలు జీవితం గడిపాడు. అనంతరం తన మకాం హనుమకొండకు మార్చాడు. ఇక్కడ మరోపేరుతో ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూనే తనకు వరంగల్ నిట్‌లో పరిచయస్తులు ఉన్నారని, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళా టీచర్‌ను నమ్మించి ఆమెవద్ద రూ.8 లక్షలతో పాటు ఆమె కొడుకుకు నిట్‌లో సీటు ఇప్పిస్తానని 60గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అలాగే, మరో ముగ్గురు బాధితుల నుంచి ఇదే తరహలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్ప డ్డాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తాను ఉంటున్న కిరాయి ఇంటి నుంచి సామగ్రి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచా రించగా నేరం అంగీకరించాడు. దీంతో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..
Comments
Please login to add a commentAdd a comment