మేం ఇద్దరం.. మాకు ఒక్కరు! | - | Sakshi
Sakshi News home page

మేం ఇద్దరం.. మాకు ఒక్కరు!

Published Sat, Mar 8 2025 1:56 AM | Last Updated on Sat, Mar 8 2025 1:51 AM

మేం ఇద్దరం.. మాకు ఒక్కరు!

మేం ఇద్దరం.. మాకు ఒక్కరు!

మహబూబాబాద్‌ అర్బన్‌: మేం ఇద్దరం. మాకు ఒక్క ఆడపిల్ల చాలు.. అంటున్నారు మానుకోట జిల్లా కేంద్రంలోని పాత బజార్‌కు చెందిన షేక్‌ మహబూబ్‌పాషా–షేక్‌ రిజ్వానా దంపతులు. 2014లో వారికి సమీర జన్మించింది. ఆ చిన్నారిని ధైర్యవంతురాలిగా పెంచాలని నిర్ణయించుకున్నారు. కరాటే, కబడ్డీ, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ నేర్పిస్తున్నారు. ఆ పాపలోనే తన తల్లిని చూసుకుంటున్నట్లు రిజ్వానా చెబుతున్నారు. మాకు అబ్బాయి పుట్టలేదని బాధపడకుండా పాపను మగపిల్లలతో సమానంగా పెంచుతామంటున్నారు షేక్‌ మహబూబ్‌పాషా– షేక్‌ రిజ్వానా దంపతులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement