కార్మిక శాఖలో కలకలం..
ట్రేడ్ యూనియన్ల ఫిర్యాదుతో ..
భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు అందాల్సిన క్లైయిమ్స్‌లో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ప్రధాన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కార్మిక శాఖలో అవినీతి అధికారుల తీరుపై ఆధారాలతో సహా ఏడాది క్రితం పలు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. యూనియన్ అందించిన ఆధారాలతో సహా మరికొన్నింటిని సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని కొంతకాలం వేచిఉన్న సర్కారు.. సుమారు రెండు నెలల క్రితం ప్రత్యేక అధికారులతో కూడిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను రంగంలోకి దింపినట్లు సమాచారం.
హన్మకొండ చౌరస్తా : కార్మిక శాఖలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కలకలం రేపుతోంది. రెండు నెలలుగా విజిలెన్స్ అధికారులు నిర్విరామంగా విచారణ కొనసాగిస్తుండడం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సుధీర్ఘ విచారణ బయటకు తెలియకుండా అత్యంత రహస్యంగా, పకడ్బందీగా చేపట్టడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గల లబ్ధిదారులను అధికారులు నేరుగా కలిసి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, కార్మిక శాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విజిలెన్స్ దాడులు, విచారణ చేపట్టడం ఇదే మొదటిసారని ఆయా శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు.
5వేల మంది లబ్ధిదారుల విచారణ..
2020 (కరోనా సమయం) నుంచి 2024 వరకు వివిధ కేటగిరీల్లో ప్రాథమికంగా దాదాపు 5వేల మంది లబ్ధిదారులు అందుకున్న క్లైయిమ్స్‌పై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక శాఖ.. గుర్తింపు కార్డు కలిగిన నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తుంది. అందులో సాధారణంగా మృతి చెందితే రూ.1,30,000, పని ప్రదేశంలో మృతి చెందితే రూ.6లక్షలు, అంగవైకల్యం పొందితే పర్సంటేజీని బట్టి రూ.20 వేల నుంచి పైచిలుకు, కార్మికుల పిల్లల వివాహ కానుక రూ.30వేలు, ప్రసవానికి రూ.30వేలు, కార్మికుడి దహన సంస్కారాలకు రూ.15 వేలు అందిస్తుంది. కాగా, లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రధాన ఫిర్యాదులు ఉన్నాయి. క్లైయిమ్స్ జమ చేయడంలో ఎవరి వాటా ఎంత? ఎలా పంచుకున్నారనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
5 వేల మంది కై ్లమ్స్ లబ్ధిదారుల జాబితాపై విజిలెన్స్ విచారణ
రిటైర్డ్, బదిలీ అధికారులను
ఎంకై ్వరీ చేసిన అధికారులు
ట్రేడ్ యూనియన్ల ఫిర్యాదుతో
రంగంలోకి..
Comments
Please login to add a commentAdd a comment