మహిళా బిల్లుతో బీసీలకు ప్రయోజనం లేదు
హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుందని, ఈ బిల్లుతో మెజార్టీగా ఉన్న బీసీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివా రం హనుమకొండ కనకదుర్గ కాలనీలో బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సీ్త్ర లేనిదే సృష్టి లేదని.. అన్ని రంగాల్లో సీ్త్రలు ముందు వరుసలో ఉన్నారన్నారు. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో 95 మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెడితే ఇందులో 54 మంది అగ్రకుల మహిళలని, 16 మంది ఎస్సీలు, 13 మంది ఎస్టీలు, నలుగురు మైనార్టీ మహిళలు ఉన్నారని, అయితే నేటి వరకు రాష్ట్రంలో 8 మంది మాత్రమే బీసీ మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారని వివరించారు. 5 శాతం కూడా లేని అగ్రవర్ణ మహిళలు 54 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికై తే అరవై శాతం ఉన్న బీసీలు ఎనిమిది మంది మాత్రమేనా అంటూ ప్రశ్నించారు. మహిళా సాధికారత సాధించాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళ సబ్ కోట పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజరి మాట్లాడుతూ.. మహిళలంతా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షురాలు మాదం పద్మజాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమా, కార్పొరేటర్ గుజ్జుల వసంత, బీసీ సంక్షేమ సంఘం నాయకులు తమ్మల శోభారాణి, మాడిశెట్టి అరుంధతి, సమత, సంధ్య, తార, పూజిత, మానస, ప్రమోద, కాసగాని అశోక్, అరేగంటి నాగరాజు, చిర్ర సుమన్, పంజాల జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
సబ్ కోటాతోనే న్యాయం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment