అసమానతలపై ధిక్కారం మహేందర్ కవిత్వం..
కేయూ క్యాంపస్: సామాజిక అసమానతలపై ధిక్కారం మహేందర్ కవిత్వం అని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం అన్నారు. ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ శనివారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా కాశీం మాట్లాడారు. మహేందర్ కవిత్వం మనిషి కేంద్రమై సాగుతూ కులమతాల నిచ్చెనమెట్ల వ్యవస్థను ప్రశ్నించిందన్నారు. ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మనిషిని సంస్కరించే దిశగా మహేందర్ కవిత్వం కొనసాగిందన్నారు. కవి, విమర్శకుడు పుప్పాల శ్రీరామ్ మాట్లాడుతూ.. సంపుటిలోని కవితలు పాఠకుల్ని తప్పకుండా కదిలిస్తాయన్నారు. ఈసభలో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు, కవి పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరశంకరం, ఆచార్యులు బన్న అయిలయ్య, కవి రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మాట్లాడారు. ఈ పుస్తకాన్ని గురిజాల శశికళ తిరుపతిరెడ్డికి కవి మహేందర్ అంకితం ఇచ్చారు. గ ట్టు రాధిక, కార్తీకరాజు, ఫణిమాధ వి, తగుళ్ల గోపా ల్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ కాల్వలో పడి
ఒకరి గల్లంతు
ఎల్కతుర్తి: ఓ యువకుడు బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాల్వలో పడి గల్లంతయ్యాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారులో శనివారం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి, గ్రామస్తులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మ హ్మద్ చొటేమియాకు నలుగురు సంతానం. కాగా, మూడో కుమారుడు మహ్మద్ సలీంపాషా(24) బ హిర్భూమికని గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వ కట్టకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి గల్లంతయ్యాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి చొటేమియా ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లి చూడగా తన కుమారుడి చెప్పులు, నెక్కర్(లాగు) ఉండడాన్ని గమనించారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి, యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment