వట్టివాగు పారుతుందని..
ఈ ఫొటోలో మీరు చూస్తున్న రైతు కేసముద్రం మండలం వెంకటగిరి శివారు తండాకు చెందిన భూక్య శ్రీను. పక్కనే ఉన్న వట్టివాగుపై ఆధారపడి పంటలను సాగు చేస్తుంటాడు. గత ఏడాది మాదిరిగా, ఈ యాసంగిలో తనకున్న ఐదెకరాల్లో వరి, ఎకరంలో బొబ్బెర, పచ్చజొన్న పంటలను సాగు చేశాడు. ఈ క్రమంలో వట్టి వాగులో చుక్క నీరు లేక పోవడంతో, గత ఏడాది మాదిరిగానే ఎస్సారెస్పీ జలాలను విడుదల చేస్తారని ఆశపడ్డాడు. కానీ పంట సాగు చేసి రెండు నెలలు కావొచ్చినా నీళ్లు విడుదల కాలేదు. దీంతో కళ్లెదుటే వరి, బొబ్బెర, పచ్చజొన్న ఎండిపోయి నేల బీటలు వారింది. మొత్తంగా సాగుకు పెట్టిన పెట్టుబడులతో పాటు, కష్టం వృథా కావడంతో ఆ రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment