ఎస్సారెస్పీ జలాలు పారుతాయని..
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యవసాయబావి మహబూబాబాద్ మండలంలోని రేగడితండాకు చెందిన బాదావత్ చంద్రు నాయక్‌ది. తనకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. తన వ్యవసాయ బావిలో నీరు ఉండాలంటే ఎస్సారెస్పీ కాల్వలు పారాలి. కానీ ఈ ఏడాది కాల్వ ల్లో ఆశించిన స్థాయిలోనీరు రాలేదు. దీంతో బావి అడుగంటింది. నీరు లేక మొక్కజొన్న కూడా ఎండిపోతుంది. ఈ పరిస్థితిలో బావిని లోతు తవ్విస్తే లాభం ఉంటుందేమో అని ఆశగా బావి తవ్వించాడు. పంటల పెట్టుబడికి రూ. 2లక్షలు కాగా బావి పూడికకు రూ. 50వేలు దాటినా.. నీళ్లు రాలేదు. రూ. 30వేలు పెట్టి బోరు వేయించినా చుక్క నీరు రాలేదు. దీంతో చేతికొచ్చే పంటను పశువులతో మేపాల్సి వస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment