వ్యవసాయ బావిలో నీళ్లు లేక..
పక్క ఫొటోలో ఎండిన వరి పంటను చూపుతున్న రైతు సీరోలు మండల కేంద్రానికి చెందిన వంగాల వెంకన్న. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు వస్తుందని ఆశ పడిన రైతుకు నిరాశ ఎదురైంది. వ్యవసాయ బావిలో నీళ్లు సరిగా లేక, ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవడంతో రెండు ఎకరాల పంట ఎండిపోయింది. సుమారు రూ.50వేలు నష్టం వాటిల్లింది. ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయని ఆశతో నాలుగు ఎకరాల్లో నాటు వేశామని.. ప్రస్తుతం పంటను పశువులను మేపడం మినహా చేసేదేమీ లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment