ఆర్చ్‌ను ఢీకొన్న టిప్పర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్చ్‌ను ఢీకొన్న టిప్పర్‌

Published Mon, Mar 10 2025 10:31 AM | Last Updated on Mon, Mar 10 2025 10:26 AM

ఆర్చ్‌ను ఢీకొన్న టిప్పర్‌

ఆర్చ్‌ను ఢీకొన్న టిప్పర్‌

డ్రైవర్‌ దుర్మరణం..ఎల్కుర్తిలో ఘటన

ధర్మసాగర్‌: ఓ టిప్పర్‌.. వెంచర్‌ ఆర్చ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ఎల్కుర్తి శివారు ఓ వెంచర్‌ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన చేపూరి అనిల్‌ (36) టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్కుర్తి శివారులో హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి వెంచర్‌ చేస్తున్నాడు. వెంచర్‌ ముందుభాగంలో ఆర్చ్‌ నిర్మాణం చేశాడు. వెంచర్‌లో టిప్పర్లతో మొరం పోస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనిల్‌ టిప్పర్‌లో మొరం లోడ్‌ చేసుకుని వెంచర్‌లో అన్‌లోడ్‌ చేశాడు. అనంతరం డబ్బా దించకుండానే వస్తున్న క్రమంలో ఆర్చ్‌ పిల్లర్‌ను ఢీకొంది. దీంతో ఆర్చ్‌ కూలి టిప్పర్‌ ముందు భాగంలో పడడంతో అనిల్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జానీపాషా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement