సాగునీటి సరఫరాలో అప్రమత్తంగా ఉండండి
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలు చేతికందే వరకు సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికారులతో సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను కలిసి పంటలు ఎండుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను వివరించారు. అనంతరం సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పంటలకు సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద అత్యధికంగా వరి సాగవుతోందని, ఎగువ భాగాన రైతులు ఎక్కువ మోటార్లు పెడుతున్నారని, చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని, సాగు నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.
పంట చేతికందే వరకు చివరి ఆయకట్టుకు నీరందాలి
కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలతో ఎమ్మెల్యేల భేటి
Comments
Please login to add a commentAdd a comment