తల్లిని హత్యచేసిన తనయుడి అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీఐ రమేశ్
ఎల్కతుర్తి: కన్నతల్లిని గొడ్డలితో నరికి హత్య చేసిన తనయుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశా రు. దీనికి సంబంధించి మండల కేంద్రంలో సీఐ పులి రమేశ్ తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం అజయ్ తనకు రావాల్సిన భూమి వాటాను తల్లి చదిరం రేవతి(45) పంచివ్వ డం లేదన్న కోపంతో ఈనెల 7న గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో మృతురాలి చిన్న కుమారుడు చదిరం విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో మండలంలోని కోతులనడుమ గ్రామ సమీపంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తారసపడిన అజయ్‌ని అరెస్టు చేసి, విచారింగా.. నేరం అంగీకరిండంతో రిమాండ్‌కు తరలించిన ట్లు సీఐ వెల్లడించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్, మల్లే శం, గణేశ్, భాస్కర్‌రెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment