వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ప్రోత్సహించాలి
● రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్
మామునూరు: వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాజన్న ఆధ్వర్యంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు మేకలు, పవర్ వీడర్స్ పంపిణీ చేసి మాట్లాడారు. వేసవిలో పశువుల మేత నిమిత్తం పాతర గడ్డి తయారీ విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విస్తరణ అధికారి కిషన్ కుమార్, అటారీ ప్రతినిధి ఎఆర్. రెడ్డి, ఉమారెడ్డి, దిలీప్‌కుమార్, బాలాజీ, బ్యాంకు మేనేజర్ రాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి, డాక్టర్ అమ్రేశ్వరి, శాస్త్రవేత్తలు అరుణ్, సౌమ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
మిర్చి రైతులకు అండగా ఉంటాం●
● మార్కెటింగ్ శాఖ జేడీ ఉప్పల శ్రీనివాస్
మహబూబాబాద్ రూరల్ : మిర్చి క్రయవిక్రయాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, వారికి అండగా ఉండి కొనుగోళ్లు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటా మని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వరంగల్ సంయుక్త సంచాలకుడు ఉప్పల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లను తనిఖీ చేశారు. రెండు, మూడు రోజుల నుంచి మిర్చి అధికంగా రావడం, మార్కెట్ యార్డులో రైతుల సమస్యలపై వారితో మాట్లాడి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ సకాలంలో కొనుగోళ్లు జరిపించి రైతులు ఇబ్బందులుపడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు మిర్చి కొనుగోళ్ల అంశాలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, కార్యదర్శి షంషీర్, సూపర్‌వైజర్ రమేశ్ పాల్గొన్నారు.
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ప్రోత్సహించాలి
Comments
Please login to add a commentAdd a comment