
ఎరుపెక్కుతున్న ఏనుమాముల..
వరంగల్ మార్కెట్‌కు పెద్దఎత్తున తరలొస్తున్న మిర్చి
వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్దయిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఎర్రబంగారం పెద్ద ఎత్తున తరలివస్తోంది. తెలంగాణే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న మిర్చి పంటతో మార్కెట్ ఎరుపెక్కుతోంది. మిర్చి సీజన్ డిసెంబర్‌లో ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి ఊపు అందుకుంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన (మంగళవారం) సుమారు 85వేల బస్తాల వరకు వచ్చినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. మార్చి 10వ తేదీ నాటికి 12,64, 243 బస్తాల్లో 5,05,005 క్వింటాళ్లు వచ్చింది. తేజ, వండర్‌హాట్, యూఎస్ 341, డీడీ, దీపిక, దేశీ, సింగిల్ పట్టీ, 1048, తాలు, ఎల్లో మిర్చితో పాటు సుమారు 20 రకాల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు వరంగల్ మార్కెట్ పరిధిలో ఉన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రైతులు వరంగల్ మార్కెట్‌కు తమ పంటను తీసుకొస్తారు. వరంగల్ మార్కెట్ పరిధిలో 25 కోల్డ్‌స్టోరేజీలు ఉండగా ఈఏడాది మరో రెండు అందుబాటులోకి వచ్చాయి. ఈకోల్డ్‌స్టోరేజీల్లో సుమారు 26 లక్షల బస్తాలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో మార్కెట్ తీసుకొచ్చిన మిర్చిని ఈ కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకునే సౌకర్యం ఉంది. దీంతో రైతులు వరంగల్ మార్కెట్‌కు అన్నిరకాల మిర్చి పంటను తరలిస్తారు. కాగా, సీజన్ చివరి నాటికి మార్కెట్‌కు 12 లక్షల క్వింటాళ్లు మిర్చి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సీజన్ చివరి నాటికి మార్కెట్‌కు మరింత సరుకు
రైతులు మిర్చి సా గు చేసినా తెగుళ్లు, ఇతర కారణాలతో పలు ప్రాంతాల్లో పంట దిగుబడులు తగ్గాయి. ఈ కారణంతోనే మార్కెట్‌కు గతేడాది కంటే కొంత వరకు తక్కువ వచ్చింది. సీజన్ చివరి నాటికి మార్కెట్‌కు గతేడాది వచ్చినంత సరుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
–గుగులోత్ రెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి, వరంగల్
సోమవారం నాటికి 12,64,243
బస్తాల్లో 5,05,005 క్వింటాళ్ల రాక
ఖమ్మం మార్కెట్‌కు తరలిన ‘తేజ’ రకం?
ఈ సీజన్ చివరి నాటికి
12 లక్షల క్వింటాళ్ల మిర్చి వస్తుందని
అధికారుల అంచనా
2022–23 2023–24 2024–25
బస్తాలు క్వింటాళ్లు బస్తాలు క్వింటాళ్లు బస్తాలు క్వింటాళ్లు
డిసెంబర్ 19,265 7,704 55,882 22,422 1,23,463 48,671
జనవరి 1,32,564 53,025 3,07,439 1,24,163 2,28,293 91,341
ఫిబ్రవరి 6,23,169 2,49,267 6,71,920 2,68,769 5,79,553 2,31,819

ఎరుపెక్కుతున్న ఏనుమాముల..
Comments
Please login to add a commentAdd a comment