
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు సాలార్ తండా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన బొల్లెబోయిన సంపత్ (26) జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం ఇంటి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన సంపత్.. సాయంత్రం తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా సాలార్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సంపత్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, సంపత్ తండా వద్ద రోడ్డుపై పశువు అడ్డంరాగా దానిని తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి పడిపోయి తీవ్రగాయాలపాలయ్యాడని కొందరు పేర్కొనగా.. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోనే మృతి చెందాడని ఆరోపించారు. ఘటనా స్థలిని టౌన్ సీఐ దేవేందర్, టౌన్ ఎస్సైలు విజయకుమార్, అలీమ్ హుస్సేన్ సందర్శించారు. మృతుడికి భార్య అఖిల, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సాలార్ తండా వద్ద ఘటన
Comments
Please login to add a commentAdd a comment