
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కేయూ క్యాంపస్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్‌పాండె అన్నారు. బుధవారం హనుమకొండలోని సుబేదారి యూ నివర్సిటీ ‘లా’ కళాశాలలో సెమినార్‌హాల్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు.. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలకు అవకాశాలు వస్తే పురుషులకు తీసిపోకుండా సమానంగా ఎ దుగుతారన్నారు. మహిళలు న్యాయం రంగంలో నూ ప్రతిభ చాటాలన్నారు. అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ మాట్లాడారు. న్యాయకళాశాల అధ్యాపకులు ఎడ్ల ప్రభాకర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. క్షమాదేశ్‌పాండెను సన్మానించారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
సెక్రటరీ క్షమాదేశ్‌పాండె
Comments
Please login to add a commentAdd a comment