
కనుల పండువగా
ఫాతిమామాత ఊరేగింపు..
కాజీపేట రూరల్ : ఫాతిమామాత తిరునాళ్ల మహోత్సవంలో రెండో రోజు బుధవారం ఫాతిమామాత స్వరూపంతో మహా రథప్రదక్షిణ ఊరేగింపు కనుల పండువగా జరిగింది. ఫాతిమాకేథిడ్రల్ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఓరుగల్లు పీఠకాపరి, విశాఖ అగ్రపీఠకాపరి బిషప్ ఉడుముల బాల ఫాతిమామాత స్వరూపం 24 ఫీట్ల రథయాత్రకు ప్రత్యేక ప్రార్థన , దూపం వేసి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం చర్చి ప్రాంగణం నుంచి ఫాతిమా మెయిన్ రోడ్, దర్గా వీధుల గుండా ఊరేగింపు కొనసాగిస్తూ తిరిగి చర్చి ప్రాంగణం వరకు సాగింది. ఇక్కడ బిషప్ ఉడుములబాల దివ్య ప్రసాద ఆశీర్వాదంతో ఊరేగింపు ముగిసింది. చర్చి ప్రాంగణంలో భక్తుల కొవ్వొత్తుల ప్రదర్శనతో ఫాతిమామాతను వేడుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ ఉడుముల బాల సందేశమిస్తూ ప్రజలందరిపై ఫాతిమామాత దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు తెఇపారు. కర్నూల్ పీఠం ఫాదర్ జెరువా జోజిరెడ్డి దివ్యబలిపూజను సమర్పించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఫాదర్ కాసు మర్రెడ్డి, కె.జెసెఫ్, టి.జోసెఫ్, జి.అనుకిరణ్, తదితరులు పాల్గొన్నారు.
ఫాతిమామాతకు భక్తుల ప్రార్థనలు..
ఫాతిమామాత గుహ వద్ద తిరునాళ్ల మహాత్సవానికి తరలి వచ్చిన భక్తులు ప్రార్థనలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి కొవ్వొత్తులు వెలిగించి, కానుకలు వేసి తమ కోర్కెలు కోరుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఫాతిమానగర్ ప్రాంతం ఎటు చూసిన సందడిగా మారింది.
కేథిడ్రల్ చర్చి నుంచి సాగిన
మహా రథప్రదక్షిణ
ప్రదక్షిణలో సందేశమిచ్చిన
బిషప్ ఉడుముల బాల

కనుల పండువగా

కనుల పండువగా
Comments
Please login to add a commentAdd a comment