
మావోయిస్టు కొరియర్లు, మిలీషియా సభ్యుల అరెస్ట్
ఏటూరునాగారం : సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కొరియర్లు, ఇద్దరు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివ ఉపాధ్యాయ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో వారి అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. వాజేడు పోలీసులు వాజేడు మండలం మురుమురు గ్రామం వద్ద ఈనెల 11వ తేదీన సాయంత్రం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా పేలుడు సామగ్రి, కార్డెక్స్ వైర్, డిటోనేటర్స్, టిఫిన్‌బాక్స్, బ్యాటరీలు, కొంత మెడిసిన్‌తోపాటు కొన్ని వస్తువులు లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల విజయ్, తీగారం గ్రామానికి చెందిన ఈరెల్లి నాగరాజు సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా, ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం పామునూరు గ్రామం బర్లగూడెం పంచాయతీకి చెందిన మడివి పాండు, మడవి బీమా మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారు. వీరు మావో యిస్టులకు నిత్యావసర వస్తువులు, ఐఈడీల తయారీలో ఉపయోగించే పేలుడు సామగ్రిని అందించేవారు. ఎప్పటికప్పుడు పోలీసుల కదలికలను పార్టీ కి చేరవేసే వారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. కార్యక్రమంలో వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, వాజేడు, వెంకటాపురం ఎస్సైలు రాజ్‌కుమార్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
Comments
Please login to add a commentAdd a comment