
మానసిక ఆరోగ్యంపై బయోటెక్నాలజీ ప్రభావం
కేయూ క్యాంపస్ : మానవుడి మానసిక ఆరోగ్యంపై బయోటెక్నాలజీ ప్రభావం ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కేయూలోని జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ ముగింపు సభలో రిజిస్ట్రార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సైకాలజీ, ఇమ్యూనాలజీ కలిసి పనిచేస్తేనే మానసికంగా ధైర్యంగా ఉండే వ్యక్తుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారన్నారు. బయోటెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేస్తున్న కొత్త ఔషధాలు, థెరఫీలు,డిప్రెషన్ యాంగైజటీ, న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల (పార్కిన్సన్,అల్జీమర్స్) చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయన్నారు. జున్యు ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య డేటా అందుబాటులోకి రావడం ప్రైవసీ ఎథికల్ (నైతిక ) సమస్యలకు దారితీస్తుందన్నారు. ఇది వ్యక్తుల మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతుందనే అంశంపై సమగ్రపరిశోధనలను సమాజ అభివృద్ధికి, మానవ ఆరోగ్యపెంపునకు ఉపయోగపడేలా అన్వయించాలన్నారు. నూతన ఆవిష్కరణల కోసం శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. వెంకయ్య, హైదరాబాద్ ఎన్‌ఐఎన్ ప్రొఫెసర్ రాజేందర్, యూనివర్సిటీ కాలేఈ ప్రిన్సిపాల్ టి. మనోహర్, యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, దూరవిద్య కేందం డైరెక్టర్ బి. సురేశ్‌లాల్, జువాలజీ విభాగం అఽధిపతి జి. షమిత, ప్రొఫెసర్లు ఈసం నారాయణ, మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. వందకుపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు.
కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
Comments
Please login to add a commentAdd a comment