
‘సుగంధ శ్రీ’ ని వినియోగించుకోవాలి
మామునూరు: రైతులు ‘సుగంధ శ్రీ’ పథకాన్ని వినియోగించుకోవాలని ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ట సూచించారు. ఖిలావరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకే కోఆర్డి నేటర్ రాజన్న ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ సౌజన్యంతో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 1.67 లక్షల ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల సాగు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు విస్తీర్ణం, అలాగే నాణ్యత ప్రమాణాలను పెంచాలన్నారు. మిరప, పసుపు, అల్లం వంటి పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. అనంతరం సుగంధద్రవ్యాల సంస్థ రూపొందించిన బుక్ లెట్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు రాజు, వేణుగోపాల్, ఉద్యాన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
సుగంధ ద్రవ్యాల సంస్థ
అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ట
Comments
Please login to add a commentAdd a comment