
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
జిల్లాలో విద్యుత్ ప్రసరించే తీగలతో చేపలను వేటాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదమని తెలిసినా విద్యుత్‌తో చెలగాటమాడుతూ మృతి చెందుతున్నారు. కాగా విద్యుత్ ప్రమాదాలపై ప్రజలకు అవగాహన లేకపోవడం, విద్యుత్ తీగలతో చేపలు పడుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– సాక్షి, మహబూబాబాద్
చేపల వేటకు
విద్యుత్ తీగల వినియోగం
● కరెంట్ షాక్‌తో పలువురి మృతి
● అడవి జంతువుల వేటలో మరికొందరు..
● విద్యుత్ ప్రమాదాలపై
కొరవడిన అవగాహన
విద్యుత్ వైర్లతో చేపలు పడుతూ చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫిబ్రవరి 12న నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన దండి ఉప్పలయ్య(45) చేపలు పట్టేందుకు వెళ్లి తెల్లవారేసరికి విద్యుత్ షాక్‌తో విగత జీవిగా మారాడు. దీంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మార్చి 4న మరిపెడ మండలం పురుషోత్తమాయిగూడెం స్టేజీ వద్ద నివాసం ఉండే జర్పుల కోట–అరుణ దంపతుల కుమారుడు శశి(20) చేపల వేటకు వెళ్లి తాను పట్టుకున్న విద్యుత్ వైర్లు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మార్చి 8న నెల్లికుదురు మండలం పెద్దతండాకు చెందిన బాదావత్ శేఖర్(21), భూక్య రాములు(45) విద్యుత్ వైర్లతో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలకోసం పెట్టే విద్యుత్ వైర్లు తగలడంతో ఒకరిని కాపాడబోయి మరొకరు ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలు బయటకు తెలిసినవి మాత్రమే.. గుట్టుచప్పుడు కాకుండా శవాలను తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయని ప్రచారం.
ఆయా మండలాల్లో..
జిల్లాలో నర్సింహులపేట, చిన్నగూడూరు, గూడూరు, నెల్లికుదురు, మరిపెడ, కురవి, సీరోలు మండలాల్లో తరచూ విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాతపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు గూడూరు, బయ్యారం, కొత్తగూడ, గంగారం మండలాల్లో పంట చేలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ వైర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. అలాగే జంతువులు సంచరించే ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్ వైర్లు అమర్చుతారు. కాగా గత ఏడాది ఆవిద్యుత్ వైర్లకు తగిలి ఎనిమిది మంది మృతి చెందినట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.
అవగాహన లేకనే ..
విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ఆశాఖ వ్యవసాయ సీజన్ ప్రారంభం జూన్ మొదటివారంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు, విద్యుత్ వినియోగదారుల సమావేశాలు, ప్రమాదాల నివారణకోసం అవగాహన కార్యక్రమాలు, పొలం వద్దకే వెళ్లి రైతులతో మమేకమై విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే జిల్లాలో కొన్నిచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. మరికొన్ని చోట్ల మొక్కుబడిగా చేపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు జనాలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన ఉండడం లేదు. ఈ క్రమంలో విచ్చలవిడిగా విద్యుత్ వైర్లు అమర్చి చేపలు, అడవి పందులను పట్టే సమయంలో జనాలు మృత్యువాత పడుతున్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న దేవేందర్
న్యూస్‌రీల్
రెండేళ్లలో విద్యుత్ షాక్‌తో మరణించిన మనుషులు, జంతువులు
సంవత్సరం మనుషులు జంతువులు మొత్తం
2023-24 37 74 111
2024-25 29 81 110
అవగాహన కార్యక్రమాలు పెంచుతాం..
చేపలు, అటవీ జంతువుల వేటకు విద్యుత్ వైర్లను వినియోగించి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, చనిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాలకు కారణాలు తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులతో చర్చించి తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం.
– నరేశ్, ఎస్‌ఈ, మహబూబాబాద్

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment