
అతిగా మద్యం సేవించి యువకుడి మృతి
గార్ల: అతిగా మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం గార్ల సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఎస్సై ఎస్‌కె.. రియాజ్‌పాషా కథనం ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ జిల్లాకు చెందిన మాకి శ్రీనివాస్(35) గార్ల మండలం బుద్దారం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద కూలీ పనులకు వచ్చాడు. నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకుండా.. భోజనం చేయకుండా నిత్యం మద్యం సేవిస్తున్నాడు. దీంతో నీరసంతో కుప్పకూలాడు. తోటి కూలీలు శ్రీనివాస్‌ను హుటాహుటిన 108లో గార్ల సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి శ్రీనివాస్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు నాగభూషణం ఫిర్యాదు మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment