
ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న కారు..
● వ్యక్తి దుర్మరణం.. భట్టుపల్లిలో ఘటన
మడికొండ : కారు.. ఆగి ఉన్న ఆటోను ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కాజీపేట మండలం భట్టుపల్లి శివారులో జరిగింది. మడికొండ ఇన్‌స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన రాపోలు శ్రీనివాస్ (46)తన భార్య రమాదేవితో కలిసి వరంగల్‌కు వెళ్లి ఆటోలో స్వగ్రామానికి వస్తున్నారు. భట్టుపల్లి మూడుచింతల వద్ద ఆటోను ఆపి కూల్‌డ్రింక్ తాగుతుండగా వరంగల్ నుంచి వస్తున్న కారు.. ఆటోను ఢీకొంది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఆపకుండా వెళ్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇన్‌స్పెక్టర్ కిషన్ సిబ్బందిని కడిపికొండ, తరాలపల్లి గ్రామాలకు పంపించి వెతికించారు. తరాలపల్లి వద్ద కారు ముందు భాగం ధ్వంసమై ఉండడం గమనించి అందులో ఉన్న దామెర మండలం పులుకుర్తికి చెందిన గుర్రాల దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment