హోలీ.. ఆనందాల కేళి | - | Sakshi
Sakshi News home page

హోలీ.. ఆనందాల కేళి

Published Fri, Mar 14 2025 1:27 AM | Last Updated on Fri, Mar 14 2025 1:27 AM

హోలీ.

హోలీ.. ఆనందాల కేళి

మహబూబాబాద్‌ రూరల్‌: హోలీ పండుగ అంటేనే సప్తవర్ణ శోభితం.. ప్రకృతిలో లభించే వివిధ రకాల చెట్ల పూలనుంచి తయారు చేసిన రంగులను చల్లుకుంటూ వసంత రుతువు ప్రారంభంలో చేసుకునే పండుగ. ఈ పండుగలో వివిధ కృత్రిమ రసాయనిక ఎరువులు వాడడం వల్ల దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. అందుకే రసాయన రంగులు పులుముకోకుండా సహజసిద్ధ కలర్లే చల్లుకుని పండగును ఆనందంగా జరుపుకోవాలని అధికారులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

కృత్రిమ రంగు..

నలుపులో లెడ్‌ ఆకై ్సడ్‌ మూత్ర పిండాల వైఫల్యాలకు దారితీస్తుంది.

కృత్రిమ ఆకుపచ్చ రంగు..

కాపర్‌ సల్ఫేట్‌ కంటి దురద, వాపు వైఫల్యాలకు దారితీస్తుంది.

వెండి రంగు..

అల్యూమినియం బ్రోమైడ్‌ క్యాన్సర్‌ కారకం.

నీలి రంగు..

పుసియన్‌బ్లూ చర్మ సంబంధ వ్యాధులు, మెర్క్యూరీ సల్ఫేట్‌ (ఎరుపు) క్యాన్సర్‌కు కారణమవుతాయి.

పౌడర్లు, గులాల్‌..

లెడ్‌, బ్రోమియం, నికెల్‌, మెర్క్యురీ, కాపర్‌, జింక్‌, వినిడికి లోపం, ఎలర్జీ, ఆయసం మొదలగు దుష్పలితాలకు దారితీస్తాయి. ముఖ్యంగా యువత ఈ పండుగను సెలబ్రేట్‌ చేసుకునే తీరుతో ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రంగులు చల్లుకుని చెరువులు, కుంటలు, సెలయేర్లలో స్నానాలు చేయడం వల్ల ఈ విషపూరిత రసాయనాలు అందులో కలిసి అనేక జీవజాతులు నాశనం అవుతున్నాయి. రంగులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలి.

సహజ రంగుల తయారీ ఇలా..

● ఎరుపు రంగు కోసం ప్రకృతిలో లభించే బీట్‌రూట్‌, మొదుగు పూలు, గులాబీ, మందారం వాడాలి.

● పసుపు రంగు కోసం పసుపు, ఆకుపచ్చ రంగు కోసం ఆకుకూరల మిశ్రమం ఇలా సహజ రంగులను వాడడం మనకే కాదు పర్యావరణానికి కూ డా మంచిది. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవ చ్చు. సహజ రంగుల్లో లభించే యాంటీ యాక్సిడెంట్లు చర్మవ్యాధులను నియంత్రించి, చర్మం మృదువుగా, తేజోవంతంగా తయారవుతుంది.

రసాయన రంగులు వద్దు..

సహజసిద్ధ కలర్లే ముద్దు

నేడు హోలీ పండుగ

సహజ సిద్ధ రంగులు వాడాలి

సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులనే వాడాలి. ప్రజలు రసాయన రంగులు చల్లడం మానుకుని అనారోగ్యంగా ఉండాలి. హోలీ పండుగను పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా నెహ్రూ సెంటరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

– లింగంపల్లి దయానంద్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కల్చరల్‌ సెక్రటరీ

పర్యావరణాన్ని కాపాడాలి

ప్రకృతిలో లభించే పూ లు, ఆకులు, ఇతరత్రా వా టితో తయారయ్యే రంగులను వినియోగించి ఆరో గ్యాన్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కూడా కా పాడిన వారమవుతాం. హోలీ వేడుకల్లో సహజరంగులనే వాడాలి. రసాయన రంగులు కళ్లలో పడితే కంటి చూపు దెబ్బతింటుంది.

– వూరె గురునాథరావు, దిశ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
హోలీ.. ఆనందాల కేళి1
1/3

హోలీ.. ఆనందాల కేళి

హోలీ.. ఆనందాల కేళి2
2/3

హోలీ.. ఆనందాల కేళి

హోలీ.. ఆనందాల కేళి3
3/3

హోలీ.. ఆనందాల కేళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement