ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలి
కాజీపేట రూరల్ : ప్రపంచ శాంతి స్థాపనకు ప్రార్థించాలని ఓరుగల్లు పీఠకాపరి, విశాఖ అగ్రపీఠకాపరి బిషప్ ఉడుముల బాల అన్నారు. ఫాతిమామాత ఉత్సవాల ముగింపులో భాగంగా హనుమకొండ జిల్లా కాజీపేట కేథిడ్రల్ చర్చి ప్రాంగణంలో గురువారం బిషప్ ఉడుముల బాల సమిష్టి దివ్యబలిపూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రపంచయుద్ధాన్ని నిలిపివేసింది ఫాతిమామాతేనని, ఆమెను ప్రార్థించి శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఆఽధ్యాత్మికతో చేసే ప్రార్థన ఎన్నో ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఫాదర్ ఆశీర్వాదం దివ్యబలిపూజతో ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్శంగా నిర్వహించిన బైబిల్ క్విజ్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కేథిడ్రల్ చర్చి అధ్యక్ష, కార్యదర్శులు బొక్క దయాసాగర్, టామి, అల్లం ప్రకాశ్‌రెడ్డి, ఫాదర్లు కాసుమర్రెడ్డి, జి.అనుకిరణ్, కె.జోసెఫ్, విజయపాల్, తాటికొండ జోసెఫ్, జి.నవీన్, ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కొడుకుపెళ్లి కావడం లేదని
మనస్తాపంతో..
ఓరుగల్లు పీఠకాపరి బిషప్ ఉడుముల బాల
ముగిసిన ఫాతిమామాత ఉత్సవాలు
ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలి
Comments
Please login to add a commentAdd a comment