టెక్నాలజీతో మార్పులు అనివార్యం
● కేయూ మాజీ వీసీ వెంకటరత్నం
కేయూ క్యాంపస్: టెక్నాలజీతో మార్పులు అనివార్యమని, టెక్నాలజీని స్వాగతించినప్పుడే వ్యాపార సంస్థల మనుగడ సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ బి. వెంకటరత్నం అన్నారు. కేయూలోని కామర్స్‌అండ్‌బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ‘న్యూహరిజన్స్ ఇన్‌కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ డ్యూరింగ్ 21ఫస్ట్ సెంచరీ చాలెంజెస్ అండ్ ఆపార్చునిటీస్’ అనే అంశంపై రెండురోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సభలో వెంకటరత్నం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫైనాన్షియల్ సెక్టార్‌లో మార్పులు చాలా ప్రభావం చూపాయన్నారు. మార్పుతోపాటే వచ్చే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అన్ని అడ్డంకులు ఎదుర్కొవాలన్నారు. వ్యాపార నిర్వహణ సులభమైనప్పటికీ విలువలతోకూడిన ఆ వ్యాపార ప్రపంచం అవసరమన్నారు. విద్యార్థులు నైపుణ్యాలపై దృష్టిసారించాలన్నారు. గౌరవ అతిథి కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ విస్తృత అవకాశాలు అందించిందన్నారు. ఇ–కామర్స్ లావాదేవీలు పెరిగాయన్నారు. ఉత్పాదకత, ఉద్యోగిత పెరిగిందన్నారు. వినియోగదారుడు కేంద్రంగా వ్యాపార వ్యవస్థ ఉందన్నారు. సదస్సులో ఆ కళాశాల ప్రిన్సిపాల్ పి. అమరవేణి, ఆచార్యులు నర్సింహాచారి, పి. వరలక్ష్మి, రాజేందర్, నిరంజన్, శ్రీనివాస్, ఎం. గిరిప్రసాద్ మాట్లాడారు. మోడరేటర్లుగా ఇ. రాజు, సాయిశరణ్, ఎం. కనకయ్య వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment