
పల్లెరోడ్లకు మహర్దశ
మహబూబాబాద్ అర్బన్: వర్షంపడితే చిత్తడిగా మారుతున్న పల్లె రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, ఇల్లెందు, పాలకుర్తి నియోజకవర్గాల్లోని మండలాల్లో 641 సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.33.75కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించగా.. ఈనెలాఖరు వరకు పూర్తి చేయాల్సి ఉంది.
నెలాఖరులోగా..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధులను ఈనెలాఖరు వరకు వినియోగించుకొని పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి. ఒక్కో సీసీ రోడ్డుకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు కేటాయించారు. రూ.5లక్షల లోపు నిధులు టెండర్ లేకుండా.. ఆపై నిధులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కాగా పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి.. లేకుంటే నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది.
జిల్లాలో మంజూరైన పనులు, నిధులు..
రూ.33 కోట్ల నిధులు మంజూరు
నెలాఖరులోగా అభివృద్ధి పనులు
పూర్తి చేయాల్సిందే..
మండలం పనులు మంజూరైన నిధులు
మహబూబాబాద్ 49 రూ. 2.45కోట్లు
నెల్లికుదురు 49 రూ. 2.45కోట్లు
గూడూరు 45 రూ.2.30కోట్లు
కేసముద్రం 47 రూ.2.20కోట్లు
మరిపెడ 54 రూ.2.80 కోట్లు
చిన్నగూడూరు 21 రూ.1.10కోట్లు
నర్సింహులపేట 32 రూ.1.60కోట్లు
దంతాలపల్లి 32 రూ. 1.60కోట్లు
డోర్నకల్ 36 రూ.2.05కోట్లు
కురవి 51 రూ.2.75కోట్లు
తొర్రూరు 52 రూ.2.28కోట్లు
పెద్దవంగర 37 రూ.1.75కోట్లు
గార్ల 40 రూ.2కోట్లు
బయ్యారం 43 రూ.2.15కోట్లు
కొత్తగూడ 32 రూ.1.62కోట్లు
గంగారం 21 రూ.1.05కోట్లు
మొత్తం 641 రూ.33.75 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment