
అంబరాన్నంటిన హోలీ సంబురాలు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువతీ యువకులు పెద్దలు, వృద్ధులు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. కులమతాలకు అతీతంగా పాల్గొని నృత్యాలు చేస్తూ రంగులు పూసుకుని హోలీ ప్రత్యేకతను చాటారు. ఆడిపాడి హోలీ సంబురాలు జరుపుకున్నారు.
ఎస్పీ క్యాంపు కార్యాలయంలో..
హోలీ పండుగ సందర్భంగా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి డీజే పాటలకు నృత్యాలు చేసి సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల డీఎస్పీలు మోహన్, శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, సీఐలు నరేందర్, చంద్రమౌళి, సత్యనారాయణ, దేవేందర్, సర్వయ్య, రవికుమార్, రాజేష్, సూర్యప్రకాష్, రాజ్ కుమార్, గణేష్, ఆర్‌ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వేడుకలు

అంబరాన్నంటిన హోలీ సంబురాలు
Comments
Please login to add a commentAdd a comment