సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
● సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈనెల 16న నిర్వహించనున్న సీఎం సభకు సంబంఽధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలో శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్ సమీపాన నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభకు సంబంధించిన సభాస్థలాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే పార్కింగ్ స్థలాలు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, సరిపడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సీఎం సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేష్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment