పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జిల్లాలోని పలువురు యువత తమ లక్ష్యాన్ని ఛేదించారు. కష్టానికి ప్రతిఫలాన్ని పొంది గెలుపుబావుటా ఎగురవేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఎదిరించి ఉన్నత ఉద్యోగాలను కై వసం చేసుకుని సత్తా చాటారు. గ్రూప్‌–1, గ్రూ | - | Sakshi
Sakshi News home page

పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జిల్లాలోని పలువురు యువత తమ లక్ష్యాన్ని ఛేదించారు. కష్టానికి ప్రతిఫలాన్ని పొంది గెలుపుబావుటా ఎగురవేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఎదిరించి ఉన్నత ఉద్యోగాలను కై వసం చేసుకుని సత్తా చాటారు. గ్రూప్‌–1, గ్రూ

Published Sat, Mar 15 2025 1:42 AM | Last Updated on Sat, Mar 15 2025 1:41 AM

పట్టు

పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జి

చిరు వ్యాపారి బిడ్డకు మూడు ఉద్యోగాలు

మహబూబాబాద్‌ అర్బన్‌: మానుకోట జిల్లా కేంద్రంలోని కేసముద్రం రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద చిన్నహోటల్‌ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న డోలి వెంకటేశ్వర్లు –పద్మ దంపతులు. వారి కుమారై డోలి సంధ్య గ్రూప్‌–3లో 450 మార్కులకు 269.9 మార్కులతో 1,125 ర్యాంక్‌ సాధించింది. జోనల్‌ స్థాయిలో బీసీ(ఏ) మహిళల విభాగంలో 2వ ర్యాంక్‌ సాధించింది. అయితే ఇప్పటీకే గ్రూప్‌–4లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మానుకోట మున్సిపల్‌ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధుల్లో కొనసాగిస్తోంది. అదేవిధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్‌–2 ఫలితాల్లో సంధ్య 600 మార్కులకు 382.4 మార్కులతో 205 ర్యాంక్‌ సాధించింది. రాష్ట్రస్థాయిలో మహిళల విభాగంలో 16 స్థానం, బీసీ(ఏ)లో మహిళల విభాగంలో మొదటి ర్యాంక్‌ సాధించారు. గ్రూప్‌–2లో మంచి పోస్ట్‌ వస్తే ఆ ఉద్యోగంలో చేరుతానని చెబుతున్న సంధ్యను తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు.

గ్రూప్‌–3లో సత్తా చాటిన ప్రణీత్‌

కొడకండ్ల: గ్రూప్‌–2 ఫలితాల్లో ప్రతిభను చాటుకున్న కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన చెన్న ప్రణీత్‌ గ్రూప్‌–3 ఫలితాల్లో 285 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 395 ర్యాంక్‌ను సాధించి సత్తా చాటాడు. 2019లో సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ప్రణిత్‌ సివిల్స్‌ సాధించాలనే సంకల్పంతో ఉండగా గ్రూప్స్‌ నోటిఫికేషన్లు రావడంతో వాటిపై దృష్టి సాఽరించాడు. గ్రూప్‌–4 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్‌ సాధించి ముషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రణీత్‌ గ్రూప్‌–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 138వ ర్యాంక్‌ సాధించడమే కాకుండా గ్రూప్‌–3 ఫలితాల్లోనూ ప్రతిభను చాటుకున్నాడు. నిరుపేద పద్మశాలీ కుటుంబానికి చెందిన ప్రణీత్‌ ఉత్తమ ర్యాంక్‌ పొందడంపై తల్లిదండ్రులు చెన్న సోమనారాయణ నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.

రెండుకు మించి ఉద్యోగాలు

గ్రూప్స్‌లో మెరిసిన యువత

No comments yet. Be the first to comment!
Add a comment
పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జి1
1/2

పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జి

పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జి2
2/2

పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement