ప్రజలకు ఉత్తమ సేవ అందిస్తా..
● గ్రూప్–3 26వ ర్యాంకర్ అజయ్‌కుమార్
చిట్యాల: ప్రజలకు ఉత్తమ సర్వీస్ అందిస్తానని గ్రూప్–2 స్టేట్ 43వ ర్యాంక్ సాధించిన నల్ల అజయ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నల్ల కోంరయ్య–నీలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన అజయ్ కుమార్ ఒకటి నుంచి పదో తరగతి వరకు మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్‌లో చదివాడు. ఇంటర్ హనుమకొండలోని శివానీ కాలేజీలో, బీటెక్ హైదరాబాద్‌లో చదివాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం, 2024లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంక్, కాళేశ్వరం జోన్‌లో 7వ ర్యాంక్ సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో స్టేట్ 26వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–2 ద్వారా వచ్చే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని చెబుతున్నాడు.. అజయ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment