కౌలురైతు ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ మృతి
చిట్యాల: అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు సూర కుమారస్వామి (40) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన సూర కుమారస్వామి నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరుపల్లి గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమార్తెకు పెండ్లి చేశాడు. మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప పంట వేశాడు. కుమార్తె పెండ్లికి తెచ్చిన అప్పుతోపాటు మూడు ఎకరాలలో వేసిన పంట సక్రమంగా పండకపోవడంతో రూ.12లక్షల వరకు అప్పులు అయ్యా యి. దీంతో గత నెల 19న పురుగుల మందు తాగా డు. కుటుంబసభ్యులు పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై ఈశ్వరయ్య పేర్కొన్నారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment