కోచింగ్ లేకుండానే..
జనగామ రూరల్: జనగామ మండలం సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి కేదారేశ్వర్‌రెడ్డి ఎలాంటి కోచింగ్‌లేకుండానే ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో 112వ ర్యాంక్, గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు కేదారేశ్వర్‌రెడ్డి సివిల్ సప్లయీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఈ సందర్భంగా కేదారేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్నారు. కేదారేశ్వర్‌రెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment