
వెంకటేశ్వర్లపల్లిలో..
రేగొండ: పంట చేనుకు నీరు పెట్టడానికి వెళ్లి విద్యుత్‌షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఇట్టబోయిన రవి (49) గురువారం అర్ధరాత్రి తన వ్యవసాయ బోరు వద్ద కరెంటు మోటార్‌ను ఆన్ చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్లిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య రజిత, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment