
18, 19 తేదీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కౌన్సెలింగ్
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీఏ హాస్పిటిల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్(హెచ్‌హెచ్‌సీఎం) అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం(ఎల్‌ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ ప్రవేశ పరీక్ష, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీఐసెట్‌లో అర్హత సాధించిన వారికి అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న వారు అంబేడ్కర్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఆయా తేదీల్లో నిర్వహించే అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు అర్హత పరీక్ష, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్లు ఒకసెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పెర్ట్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. అంబేడ్కర్ వర్సిటీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
ఎస్సారెస్పీ కాల్వలో పడి మహిళ మృతి
పర్వతగిరి: ఎస్సారెస్పీ కాల్వలో కొట్టుకుపోయి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని హట్యతండా శివారు ఎర్రకుంట తండాలో చోటు చేసుకుంది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రకుంటతండాకు చెందిన బాదావత్ నేజి(78) గురువారం ఉదయం దుస్తులు ఉతకడానికి ఎస్సారెస్పీ కాల్వలోకి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి కొట్టుకుపోయింది. శుక్రవారం ఉదయం నెక్కొండ మండలం బొల్లికొండ తండా వద్ద ఎస్సారెస్పీ కెనాల్‌లో శవమై తేలి కన్పించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భూపాలపల్లి అటవీ
గ్రామాల్లో మరో పులి ?
భూపాలపల్లి రూరల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలూ పూర్, రాంపూర్ గ్రామాల మధ్య ఫార్టెస్టు అధి కారులు శుక్రవారం పులి పాదముద్రలు గుర్తించారు. కాటారం, మండలం జాదారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో రఘుపల్లి అటవీ ప్రాంతంలో చెరువుకట్టపై ఈ నెల 12న ఆవుదూడను చంపి తిన్నట్లు ఆనవాళ్లు లభించాయి.
పాదముద్రలు వేరేనా..?
శుక్రవారం కాటారం మండలం మేడిపలి, కొత్తపల్లి గ్రామాల మీదుగా భూపాలపల్లి మండలంలోని రాంపూర్, కమలాపూర్ అటవీ గ్రామాల మధ్య పులి అడుగుజాడలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాటారం పులి పాదముద్రలు, ఈ పులి పాదముద్రలు సరిపోకపోవడంతో మరో ఆడ పులిగా అనుమానిస్తున్నారు. కాటారం మండలంలో మగ పులి, భూపాలపల్లి మండలలో ఆడ పులి తిరుగుతున్న నేపథ్యంలో భూపాలపల్లి అటవీ గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామస్తులకు పులి కనపడిన, అటవీలో ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి పులులకు ప్రమాదాన్ని కలిగించినా.. కఠిన చర్యలు తప్పవని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.

18, 19 తేదీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కౌన్సెలింగ్
Comments
Please login to add a commentAdd a comment