
ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలంగాణ ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంచంద్రాపురం కాలనీలో ముదిరా జ్, మత్స్యకారులతో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజికవర్గాల బలోపేతం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలో కురిసిన అతిభారీ వర్షాల కారణంగా కోట్లాది రూ పాయల విలువైన మత్స్యసంపదను కోల్పోయి నష్టపోయిన ముదిరాజ్ మత్స్యకారులను ఆదుకునేందు కు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గల ముదిరాజ్ పెద్దలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా సీ ఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. గత ప్రభు త్వ విధానాల వల్ల కోకాపేటలో ముదిరాజ్‌లకు ఇచ్చిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవ భవన నిర్మా ణం స్థల వివాదం కారణంగా నిలిచిపోయిందన్నా రు. మహిళా మత్స్యకార్మికులకు ఆర్థిక భరోసా క ల్పించేలా కార్యచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ ఫిషర్‌మెన్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొడుగు శ్రీనివాస్, తెలంగాణ మహజన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి దుండి వెంకటేశ్వర్లు, పిడుగు వెంకన్న, పెద్ది సైదులు, సందీప్, బాలాజీ, ఉప్పలయ్య, గోపాల్, వెంకన్న పాల్గొన్నారు.
తెలంగాణ ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment