బతుకుదెరువుకోసం వచ్చి..
సంగెం: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ భవననిర్మాణ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా జిగురుమల్లి మండలం పాలేటిపాడు గ్రామానికి చెందిన కోయ బంగారు బాబు(34) తన భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి పొట్టకూటి కోసం సంగెం మండల కేంద్రంలో కొన్నేళ్లుగా ఉంటూ.. భవన నిర్మాణ తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పనిపై తిమ్మాపూర్ గ్రామానికి తోటి మేసీ్త్ర ఉలవపాడుకు చెందిన పులగర శివమణి అలియాస్ మణికంఠతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి సంగెంకు వస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ నుంచి నెక్కొండ వైపునకు అరటిగెలలు తీసుకొచ్చేందుకు ట్రేలతో వెళ్లుతున్న బోలేరో అతివేగంగా అజాగ్రత్తగా సబ్‌స్టేషన్ సమీపంలో.. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బంగారు బాబుకు కుడి చేయి, కాలుకు, శివమణికి కుడి చేయి, కుడికాలుకు గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బంగారుబాబు మృతి చెందగా.. శివమణి చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఎంజీఎంలో పోస్టుమార్టమ్ అనంతరం బంగారుబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బోలేరో వాహనం తప్పించుకుని వెళ్లగా సీసీ కెమెరాల సాయంతో ట్రేస్ చేశామని ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మేసీ్త్ర
మృతుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా
పాలేటిపాడు
బతుకుదెరువుకోసం వచ్చి..
Comments
Please login to add a commentAdd a comment