
సర్వం సిద్ధం
‘సీఎం కృతజ్ఞత సభ’కు
నేడు ఘన్‌పూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన
జనగామ: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయనుండగా.. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన ‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎంపీ కడియం కావ్య శనివారం పరిశీలించారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
జఫర్‌గఢ్ మండలం కోణాయచలం సమీపాన రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ స్కూల్(గురుకులం) కాంప్లెక్స్, రూ.146 కోట్లతో ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్, రూ.46కోట్ల వ్యయంతో ఘన్‌పూర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపాన 100 పడల ఆస్పత్రి, రూ.26కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్(ప్రభుత్వ కార్యాలయాల సముదాయం), రూ.50 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులు, రూ.26కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, డ్రెయినేజీలు, రూ.250 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల(మొదటి విడత) నిర్మాణ పనులను సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సెల్ఫ్‌హెల్ఫ్ గ్రూపులకు రూ.100కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేస్తారు. అనంతరం సీఎం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను సందర్శిస్తారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. శంకుస్థాపనలకు సంబంధించి సభా వేదిక సమీపంలోనే ఒకే చోట శిలా ఫలకాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
రెండు రూట్లలో తరలింపు
సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో 50 వేల మందిని తరలించనున్నారు. ఇందుకు సంబంధించి వేలేరు, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల నుంచి వచ్చే వారు ఘన్‌పూర్ టౌన్ మీదుగా.. జఫర్‌గఢ్, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల వారు ఇప్పగూడెం మీదుగా రానున్నారు. ఈ రెండు రూట్లలో పోలీసు నిఘా ఉంటుంది. శివునిపల్లి వ్యవసాయ మార్కెట్, విశ్వనాథపురం సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచారు. సీఎం పర్యటన నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు.
– 8లోu
రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి
పనులకు శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవాలు
మహిళా సంఘాలకు
రూ.100 కోట్ల రుణాలు..
వ్యవసాయ మార్కెట్ సమీపంలో
బహిరంగ సభ
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే
కడియం, ఎంపీ కావ్య, అధికారులు
సీఎం టూర్ షెడ్యూల్ ఇలా..
మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్‌లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు
1 గంటకు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్‌కు చేరుకుంటారు.
1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు
1.25 నుంచి 3 గంటల వరకు శివునిపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు.
3.10 గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
సీఎం రేవంత్‌రెడ్డి సభను
అడ్డుకుంటాం
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment