
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
మహబూబాబాద్: టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 8,194 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. మాస్ కాపీంగ్‌కు తావు లేకుండా తగు ఏ ర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. వీర బ్రహ్మచారి, తొర్రూరు ఆర్డీఓ గణేష్, డీపీఓ హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఏఐ కోర్సు ప్రారంభం
కురవి: సీరోలు మండల కేంద్రంతోపాటు చింతపల్లి, కొత్తూరు(సీ) గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంప్యూటర్ కోర్సులను అడిషనల్ కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. మూడు పాఠశాలల్లో కంప్యూటర్‌లను ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన పెంచడంతోపాటు, కృత్రిమ మేథను వివరించడం జరుగుతుందన్నారు. అనంతరం టెన్త్ విద్యార్థుల ప్రిపరేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, జీ సీడీఓ విజయకుమారి డీఎస్‌ఓ బి.అప్పారావు, ఎంఈఓ లచ్చిరాం, హెచ్‌ఎంలు బి.శంకర్‌నాయక్, అ రుణ, బంగారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
గూడూరు: మండలంలోని మచ్చర్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యాబోధనను డీఈఓ రవీందర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
Comments
Please login to add a commentAdd a comment