
సీఎం రేవంత్‌రెడ్డి సభను అడ్డుకుంటాం
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల ముందు పలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ హామీలను అమలు చేయకుండా నిరంకుశ పాలన సాగిస్తున్నారని, నేడు ఘన్‌పూర్‌లో నిర్వహించనున్న సీఎం ‘కృతజ్ఞత సభ’ అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అక్రమంగా సస్పెండ్ చేశారని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడారని, రైతుల సమస్యలపై ప్రశ్నించిన జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం అమానుషమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ నియంతపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో చెప్పిన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం కడియం శ్రీహరి నిర్వహించే సభకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి దొడ్డిదారిన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరారని ఎద్దేవా చేశారు. కడియంకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సభకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మారపాక రవి, ఆకుల కుమార్, మాచర్ల గణేశ్, తాటికొండ సురేశ్, కుంభం కుమార్, బంగ్లా శ్రీను, మునిగెల రాజు, మారెపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, గుర్రం శంకర్, శ్రీను, గాదె రాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
Comments
Please login to add a commentAdd a comment