కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాలి
వెంకటాపురం(ఎం): రాష్ట్రంలోనే అరుదైన వృక్ష సంపద మండలంలోని పాలంపేట పరిధిలో ఉందని, కేన్ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని వరంగల్ ఆయుర్వేద కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అనిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా శనివారం వృక్షశాస్త్ర పరిశోధకుడు, కేన్‌మ్యాన్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ సుతారి సతీశ్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అధ్యాపకురాలు అనంతలక్ష్మితో కలిసి కేన్ ప్రాంతాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఏకై క కేన్ ప్రాంతం పాలంపేటలోనే ఉందన్నారు. కేన్ ప్రాంతంలో 125 జాతుల ఆయుర్వేద మందు మొక్కలు ఉన్నాయని, వివిధ రకాల రోగాలను నయం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 51 ఎకరాల్లో ఉన్న కేన్ ప్రాంతాన్ని కాపాడుకుని ఆరోగ్య భారత్‌ను నిర్మించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ 51 ఎకరాల చుట్టూ ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కేన్ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ జోన్‌గా ప్రకటించి, కెనోపి వాక్ పేరుతో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో పరిశోధన బృందం సభ్యులు డాక్టర్లు నిఖిత, కృష్ణసాయి, ఆకాశ్, సుమ తదితరులు ఉన్నారు.
వరంగల్ ఆయుర్వేద కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అనిశెట్టి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment