ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలి
● ఉద్యాన శాఖ వరంగల్ జిల్లా అధికారి సంగీత లక్ష్మి
మామునూరు: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని ఉద్యాన శాఖ వరంగల్ జిల్లా అధికారి సంగీత లక్ష్మి సూచించారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త రాజన్న ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ సౌజన్యంతో సుగంధ ద్రవ్యాల సాగుపై మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు పసుపు, మిరప, కూరగాయల విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఉద్యాన పంటల సాగును పంట మార్పిడిగా ఉపయోగించాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందన్నారు. అంతకు ముందు సుగంధ ద్రవ్యాల పంట సాగు విధానాలపై శిక్షణ పొందిన రైతులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సౌమ్య, రాజు, నాగరాజు, వేణుగోపాల్, హర్షరెడ్డి, సాయిచంద్, సుశ్రాత్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment