పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని సోషల్ మీడియా కో ఆర్డినేటర్లకు ఐడీ కార్డులు, ఇన్సూరెన్స్ కాపీలు, డైరీలను ఎంపీ ఆదివారం అందజేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని జిల్లా, నియోజకవర్గ, మండల కో ఆర్డినేటర్లకు టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్, టీజీటీఎస్ చైర్మన్ మన్నె సతీశ్‌కుమార్ సహకారంతో టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అంబాల శివకుమార్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులు, ఇన్సూరెన్స్ కాపీలు, డైరీలు అందజేశామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో బయ్యారం పీఏసీఎస్ డైరెక్టర్ జూలకంటి సీతారాంరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సామ మధుసూదన్ రెడ్డి, పినపాక, భద్రాచలం, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు డునుకు రాము, ప్రేమ్, గుగులోతు నవీన్, తవిశెట్టి రాకేష్, షేక్ ఖాజాపాషా, గుగులోతు రమేశ్, నాగేంద్రబాబు, నాళ్ల కిరణ్, మాలిక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ పోరిక బలరాంనాయక్
Comments
Please login to add a commentAdd a comment