పేదలకు వరం సీఎం సహాయ నిధి
తొర్రూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. మొత్తం 104 మంది లబ్ధిదారులకు రూ.33.93 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతీ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తూ పేదల పెన్నిధిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యా నాయక్, నాయకులు గంజి విజయ్‌పాల్‌రెడ్డి, సోమ రాజశేఖర్, ముద్దసాని సురేష్, చిత్తలూరి శ్రీనివాస్, మేకల కుమార్, మొగుళ్ల లింగన్న, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment