సరఫరా చేస్తాం
డిమాండ్ ఎంతైనా..
సత్వరమే లోపాల గుర్తింపు..
విద్యుత్ సరఫరాలో లోపాల్ని ఆన్‌లైన్ ద్వారా సత్వరమే గుర్తించి పరిష్కరించడానికి 11 కేవీ ఫీడర్లకు.. ఫీడర్ అవుటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టం అమల్లోకి తీసుకురానున్నాం. విద్యుత్ లైన్‌లో ఎక్కడ లోపం ఏర్పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందో ఈటెక్నాలజీ ద్వారా ఆటోమేటిగ్గా తెలుసుకోగలుగుతాం. ఎక్కడ సమస్య ఉత్పన్నమైందో లోకేషన్‌తో కూడిన సమాచారం ప్రత్యేక యాప్ ద్వారా అధికారులకు తెలుస్తుంది. అధికారులు వెంటనే అప్రమత్తం కావడానికి ఈ సిస్టం ఉపయోగపడుతుంది. తద్వారా క్షేత్రస్థాయి ఉద్యోగుల ద్వారా సమస్య తలెత్తిన స్థలం వివరించి త్వరగా.. సమస్యను పరిష్కరించే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించవచ్చు. ప్రస్తుతం ఏదైనా సమస్య ఏర్పడితే ఆ లైన్ మొత్తం పరిశీలించాల్సి వస్తోంది. దీంతో చాలా సమయం తీసుకోవడంతో కాలయాపన జరుగుతోంది. ఫీడర్ అవుటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టం అమల్లోకి తీసుకొస్తే సమయం ఆదా కావడంతో పాటు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్‌ను పునరుద్ధరించగలుగుతాం.
● వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్
● ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్న ఎన్పీడీసీఎల్
● పైలెట్ ప్రాజెక్టుగా ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణం
● టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
కర్నాటి వరుణ్‌రెడ్డి ● ‘సాక్షి’కి ఇంటర్వ్యూ
పేపర్ లెస్ వర్క్..
ఈ–స్టోర్స్ విధానం ద్వారా కావాల్సిన మెటీరియల్ ఆన్‌లైన్ ద్వారా రిజర్వ్ చేసుకుని కావాల్సిన సమయానికి మెటీరియల్‌ను పొందుతున్నాం. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. పేపర్ పని లేకుండా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసి మెటీరియల్ డ్రా చేసుకునే సౌలభ్యం క్షేత్రస్థాయిలో అధికారులకు కలిగింది. తద్వారా రైతులకు, వినియోగదారులకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతీ పనిలో అధునాతన సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్నాం. సాంకేతికపరంగా మరిన్ని అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను 19 ఫీచర్లతో రూపొందించాం.
హన్మకొండ: ‘వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగనుంది. పెరుగుతున్న డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి ప్రణాళిక రూపొందించుకుని ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. ఈఏడాది ఫిబ్రవరి నుంచి డిమాండ్ పెరిగింది. రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 11న (మంగళవారం) ఉదయం అత్యధికంగా 5,815 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాది ఇదే రోజు 5,468 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాదితో పోలిస్తే 347 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది’ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
సాంకేతికతలో అభివృద్ధి..
ఎన్పీడీసీఎల్‌లో సాంకేతికతను అభివృద్ధి చేశాం. ప్రతీ పనిని ఆన్‌లైన్ ద్వారా చేస్తున్నాం. కొత్త సర్వీస్ కనెక్షన్లు, లైన్ షిఫ్టింగ్, ఫిర్యాదులు, దరఖాస్తుల స్థితిగతులు, చెల్లింపులు అన్నీ కూడా ఆన్‌లైన్ ద్వారా చేపడుతున్నాం. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండేలా.. ఎస్టిమేట్ వివరాలు తెలుగులో అందిస్తున్నాం. భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతికంగా విద్యుత్ సమస్యల వల్ల ఏర్పడే అంతరాయాలను తగ్గించేందుకు.. ఎమర్జెన్సీ పవర్ రీస్టోర్ టీం వాహనాలను వాడుతున్నాం. ఇందులో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. పాత సబ్‌స్టేషన్లను పునరుద్ధరిస్తున్నాం. సుదూర లైన్ల మధ్యలో ఏబీ స్విచ్‌లు పెడుతున్నాం. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు కూడా పెట్టాం. తద్వారా అంతరాయాలు త్వరితగతిన గుర్తించి పునరుద్ధరిస్తున్నాం.
స్థల సమస్య జఠిలం..
కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థల సమస్య జఠిలంగా మారింది. ఈక్రమంలో స్థల సమస్యను ఎదుర్కొనేందుకు ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ముందుగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హనుమకొండ, కరీంనగర్, ఖ మ్మం, నిజామాబాద్ నగరాల్లో ఒక్కో సబ్ స్టేషన్‌ను నిర్మించనున్నాం. ఈ సబ్‌స్టేషన్లు కొత్తవి కావడంతో ఈమేరకు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ వాడతాం. ఈవ్యవస్థపై అవగాహన కోసం శిక్షణ ఇవ్వనున్నాం. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీలో ఇండోర్ సబ్ స్టేషన్లున్నాయి. ఇండోర్ సబ్ స్టేషన్లతో తక్కువ స్థలంలోనే సబ్‌స్టేషన్ నిర్మించుకుని వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించవచ్చు.
సరఫరా చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment