కాంగ్రెస్ అంటే సంక్షేమం, అభివృద్ధి : మంత్రి సీతక్క
కాంగ్రెస్ అంటే సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఉపాధి, మహిళల అభివృద్ధి, పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించే ప్రభుత్వం తమదన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 84వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని దుస్థితి ఉంటే.. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే 55 వేల పైచిలుకు ఉద్యో గాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు. ఇందిరమ్మ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు సంక్షేమం అందిస్తుంటే, బీఆర్‌ఎస్, బీజేపీ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయ ని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ అంటేనే అవినీతి, అక్రమాల ప్రభుత్వంగా చరిత్రలో పేరు లిఖించుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment